Home Page SliderNational

వాపును చూసి బలుపనుకుంటున్నారు? దేశ ఆర్థిక వ్యవస్థ గురించి రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలు

దేశం సూపర్, డూపర్ అన్నది వాస్తవం కాదు…
అంతగా భారతదేశం అభివృద్ధి జరగడం లేదు
ఇలాంటి వాటిని నమ్మడం, ప్రచారం చేయడం తప్పు
దేశ పరిస్థితులపై రఘురామ్ రాజన్ హెచ్చరిక
ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అతిపెద్ద సవాళ్లు ఎదుర్కోవాలి
శ్రామిక శక్తి, నైపుణ్యాలను మెరుగుపరచినప్పుడే అభివృద్ధి సాధ్యం

భారతదేశం బలమైన ఆర్థిక వృద్ధికి సంబంధించిన “హైప్” ను నమ్మి పెద్ద తప్పు చేస్తోందని… దేశం అలాంటి సామర్థ్యాన్ని చేరుకోడానికి గణనీయమైన నిర్మాణ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు శ్రామిక శక్తి, నైపుణ్యాలను మెరుగుపరచడం అని రాజన్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. 1.4 బిలియన్ల జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు ఉన్న దేశంలో, భారతదేశం తన యువ జనాభా వల్ల దేశానికి కలిగే ప్రయోజనాలను పొందేందుకు కష్టపడుతుందని ఆయన అన్నారు. “భారతదేశం చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే హైప్‌ను నమ్మడం” అని ఆయన అన్నారు. “హైప్ నిజమని నిర్ధారించుకోవడానికి ఇండియా ఇంకా చాలా సంవత్సరాలు కష్టపడాల్సి ఉంది. కానీ రాజకీయ నాయకులు జనం నమ్మాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మేం చేశామని… మీరు నమ్మాల్సిందేనని కోరుకుంటున్నారు.” కానీ భారతదేశం ఆ నమ్మకానికి లొంగిపోవడం తీవ్రమైన తప్పు అవుతుందని రఘురామ్ రాజన్ హెచ్చరించారు.

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాన్ని కొట్టిపారేశారు రాజన్. అనేక మంది పిల్లలు హైస్కూల్ విద్యకు దూరమవుతున్నారని… అధిక డ్రాపవుట్లతో విద్యా వ్యవస్థ కునారిల్లుతోందని, అలాంటప్పుడు ఇలాంటి ప్రేలాపనలు అనవసరమన్నారు. “మనకు పెరుగుతున్న శ్రామిక శక్తి ఉంది, కానీ వారు మంచి ఉద్యోగాలలో ఉపాధి పొందితేనే అది దేశానికి డివిడెండ్” అని చెప్పాడు.”, తన దృష్టిలో అలా లేకపోవడమే అతిపెద్ద విషాదమని చెప్పుకొచ్చాడు. భారతదేశం ముందుగా శ్రామిక శక్తికి తగిన విధంగా ఉపాధి అవకాశాల కల్పన చేయాలన్నారు. రెండోది, దేశంలోని శ్రామికశక్తికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పారు. కరోనా మహమ్మారి తర్వాత భారతీయ పాఠశాల పిల్లల అభ్యాస సామర్థ్యం 2012కి ముందు స్థాయికి పడిపోయిందని, గ్రేడ్ త్రీ విద్యార్థులలో 20.5% మంది మాత్రమే గ్రేడ్ టూ పాఠాన్ని చదవగలరని రాజన్ పలు అధ్యయనాలను వివరించారు. భారతదేశంలో అక్షరాస్యత రేట్లు వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉన్నాయన్నారు. “ఇది నిజంగా ఆందోళన కలిగించే సంఖ్య” అని చెప్పాడు. స్థిరమైన ప్రాతిపదికన 8% వృద్ధిని సాధించడానికి భారతదేశం చాలా ఎక్కువ కాలం పడుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థ అవకాశాల గురించి ఇటీవలి కలుగుతున్న ఆశావాదం వర్కౌట్ కాదన్నారు.

వేగవంతమైన విస్తరణను సద్వినియోగం చేసుకోవడానికి విదేశీ పెట్టుబడిదారులు భారతదేశానికి తరలివస్తున్నారు. ఇది రాబోయే ఆర్థిక సంవత్సరంలో 7% కంటే ఎక్కువగా చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారింది. ఉన్నత విద్య కోసం వార్షిక బడ్జెట్ కంటే చిప్‌ల తయారీకి రాయితీలపై ఎక్కువ ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం చేసిన విధాన ఎంపికలు తప్పుదారి పట్టించాయని రాజన్ అన్నారు. భారతదేశంలో కార్యకలాపాలను స్థాపించడానికి సెమీ-కండక్టర్ వ్యాపారాలకు రాయితీలు 760 బిలియన్ రూపాయలు ($9.1 బిలియన్లు), ఉన్నత విద్య కోసం కేటాయించిన 476 బిలియన్ రూపాయలతో పోలిస్తే ఎక్కువన్నారు. విద్యా వ్యవస్థను చక్కదిద్దే పని చేయకుండా చిప్‌ల తయారీ వంటి ఉన్నతమైన ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించిందని… కానీ ఆ పరిశ్రమలకు అవసరమైన సుశిక్షిత ఇంజనీర్లను తయారు చేయాల్సిన బాధ్యతల ప్రభుత్వానిదేనన్నారు. “ప్రభుత్వ ఆశయం గొప్పదని, గొప్ప దేశం కావాలి” అన్నారు. ఐతే, “వారు ఏం చేయాలన్న దానిపై శ్రద్ధ చూపుతున్నారా లేదా అనేది వేరే ప్రశ్న. చిప్ తయారీ వంటి గొప్ప పరిశ్రమలు దేశానికి ముఖ్యమే ఐనప్పటికీ… ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై మరింతగా చొరవ చూపాలన్నారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్ రాజన్ గ్లోబల్ ఎకానమీపై సుప్రసిద్ధ వ్యాఖ్యాత, భారతదేశ విధానాలపై బహిరంగ విమర్శలు చేసేవాడు. అభిప్రాయాల చెప్పడం ద్వారా, కరడుగట్టిన రాజకీయ నాయకుల దాడికి గురయ్యారు. గవర్నర్‌గా తన పదవీకాలం పూర్తయ్యాక, 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నిష్క్రమించాడు. బ్రేకింగ్ ది మౌల్డ్… రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనే పుస్తకానికి సహ రచయితగా ఉన్నారు. భారతదేశ వృద్ధి ఔట్‌లుక్‌కు దృక్పథాన్ని అందించడానికి తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో వరుస వీడియోలను రాజన్ విడుదల చేస్తున్నాడు.

విద్యను మెరుగుపరచడంతోపాటు, అసమానతలను తగ్గించడం, శ్రమతో కూడిన ఉత్పత్తిని పెంచడం వంటి అనేక విధాన ప్రాధాన్యతలను కొత్త పరిపాలన కోసం రాజన్ హైలైట్ చేశారు. భారతదేశ పాలక వ్యవస్థ చాలా కేంద్రీకృతమైందని, రాష్ట్రాలకు నియంత్రణను అప్పగించడం అభివృద్ధిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. “మనకు కావలసింది ఆచరణాత్మక విధానం” అని రాజన్ అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణలకు నాయకత్వం వహించిన చైనా మాజీ నాయకుడు డెంగ్ జియావోపింగ్‌ను ఉటంకిస్తూ, రాజన్ మాట్లాడుతూ, చైనా నుండి భారతదేశం ఏదైనా నేర్చుకుంటే, “పిల్లి నల్లగా లేదా తెల్లగా ఉన్నా పర్వాలేదు, అది ఎలుకలను పట్టుకోవడమే ముఖ్యం” అని రాజన్ అన్నారు.