జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రఘునందన్ రావు హాట్ కామెంట్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆయన ఆరోపించారు.
“ఒకరు కన్నీళ్లతో ప్రచారానికి వస్తే, ఇంకొకరు కట్టెలతో వస్తున్నారు. కానీ చివరికి ఈ ఇద్దరిలో ఎవరు వచ్చినా, సిటీ మూసీ వద్ద కలిసే పరిస్థితి తప్పద” అంటూ రఘునందన్ రావు విమర్శించారు.
తెలంగాణలో ప్రజలు గత ఎన్నికల్లోనే ఈ రెండు పార్టీల మోసపూరిత రాజకీయాలను గుర్తించారని, ఇకపై వారి నాటకాలతో ఎవ్వరూ మభ్యపడరని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధి, నిజాయితీ గల నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రఘునందన్ తెలిపారు.
రాజకీయ వర్గాల్లో ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ వ్యూహం ఏంటి అన్నదానిపై కూడా ఈ వ్యాఖ్యలతో ఆసక్తి పెరిగింది.