Home Page SliderNational

శర్వానంద్‌తో రచ్చ డైరెక్టర్ మూవీ?

యంగ్ హీరో శర్వానంద్‌తో మాస్ డైరెక్టర్ సంపత్ నంది సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. సంపత్ చెప్పిన కథకు ఈ హీరో అంగీకరించారని సినీవర్గాల్లో టాక్. ఫ్యామిలీ హీరోను పవర్‌ఫుల్ రోల్‌లో చూపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సంపత్ నంది సాయిధరమ్ తేజ్‌తో గాంజా శంకర్ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో ఈ కథనే మార్చి శర్వాతో తీస్తారని చర్చ నడుస్తోంది.