క్వీన్ ఎలిజబెత్ II చివరిగా చేసిన పనేంటంటే!
క్వీన్ ఎలిజబెత్ II చివరిగా చేసిన పనేంటంటే!
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 చివరిసారిగా చేసిన అఫీషియల్ పనేంటంటే… ఆమె కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్‌ను నియమించడం.
సాధారణంగా, వెళ్లే ప్రధాని, వచ్చే ప్రధాని బాధ్యతల స్వీకార వేడుకలు సెంట్రల్ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రాణిని కలవడం ద్వారా జరుగుతాయ్. కానీ ఆమె అనారోగ్యంగా ఉండటంతో ఈసారి కార్యక్రమం అలా జరగలేదు. రాణి మరణానికి రెండు రోజుల ముందు, క్వీన్ ఎలిజబెత్ II బోరిస్ జాన్సన్ రాజీనామా ఆమోదించి… తర్వాత బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్‌ను నియమించారు. మాజీ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, 47, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, 15వ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆమెదం తెలిపిన ఫోటో అధికారికంగా విడుదలయ్యింది. 96 ఏళ్ల రాణి అనారోగ్యం కారణంగా లండన్‌కు తిరిగి రావడానికి కష్టమని భావించి… ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టే వేడుక స్కాటిష్ హైలాండ్స్‌లోని రిమోట్ బాల్మోరల్ రిట్రీట్‌లో జరిగింది. రాణి కొత్తగా ఎంపికైన ప్రధానిని ఎంతగానో స్వాగతించి ఆమె అభ్యర్థనను మన్నించారని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. 1885లో విక్టోరియా రాణి సింహాసనంపై ఉన్నప్పుడు బాల్మోరల్‌లో చివరిసారిగా అధికార బాధ్యతలు అప్పగించగా నేడు మళ్లీ నేడు బాధ్యతల స్వీకారం అప్పగింత జరిగింది. అప్పగించబడింది.
