రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాల్సిందే
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని గానుగబండ గ్రామంలో పలు రోడ్ల నిర్మాణ పనులకు , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. తరువాత గానుగబండ గ్రామంలోని దుర్గామాత ఆలయాన్ని దర్శించి ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను కోరుకుంటూ, బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ఈఈ వెంకటయ్య, తహసిల్దార్ కవిత, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.