Home Page SliderTelangana

విద్యుత్ బిల్లుల కోసం క్యూఆర్ కోడ్

తెలంగాణ విద్యుత్ శాఖ విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం కొత్తగా క్యూఆర్‌ కోడ్‌ను అమల్లోకి తెస్తోంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లను ఆర్బీఐ ఆదేశాలో విద్యుత్ చెల్లింపులకు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే బిల్లుల ఎలా కట్టాలా అనే మీమాంస వినియోగదారులలో నెలకొంది. దీనికి ఈ క్యూఆర్ కోడ్ వల్ల పరిష్కారం లభించనుంది. విద్యుత్ బిల్లు వచ్చాక, దానికింద క్యూఆర్ కోడ్ ఉంటుంది. వినియోగదారులు దానిని స్కాన్ చేసి, డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి యాప్‌ల ద్వారా చెల్లించవచ్చు. ఈ విధానం ఇప్పటికే TGSPDCL కొన్ని జిల్లాలలో అమలు చేస్తోంది. తొందరలోనే అన్ని జిల్లాలలో అమలు చేయనున్నట్లు సమాచారం.