పీవీ అందించిన స్ఫూర్తి మరవలేనిది: కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం: భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థికస్థితిని చక్కదిద్దిన దార్శనికుడు పీవీ అని అన్నారు. భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు.

