ఘనంగా పీవీ సింధు వివాహం..
భారత ఒలింపిక్ స్టార్, బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహ జీవితంలో అడుగుపెట్టింది. తన స్నేహితుడు పొసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో ఆమెకు గతంలో ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 22 రాత్రి 11.20కి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్‌లో ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. మంగళవారం డిసెంబర్ 24న హైదరాబాద్‌లో జరగబోయే రిసెప్షన్‌కు ప్రముఖులు హాజరవుతారని సమాచారం. వివాహానికి సంబంధించిన ఫోటోలను వారి కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం గమనార్హం.
Breaking news: గ్యాంగ్‌స్టర్‌ను పట్టించిన పుష్ఫ 2