Andhra PradeshHome Page SliderSports

విశాఖలో పీవీ సింధు భూమి పూజ

రాష్ట్రప్రభుత్వం విశాఖలో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుకి మూడెకరాల స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలోని పెద గదిలి కూడలి సమీపంలోని ఆ స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి తన తల్లిదండ్రులతో కలిసి ఆమె భూమి పూజ చేశారు. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేస్తామని, త్వరలోనే శిక్షణ ప్రారంభిస్తామని తెలియజేశారు. ఆసక్తి ఉన్న చిన్నారులను, యువతను ప్రపంచస్థాయిలో పోటీలలో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ అకాడమీ నిర్మిస్తున్నట్లు తెలిపారు.