పుష్ప-2 వైల్డ్ జాతర షురూ……!
అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప-2’ గురువారం రాత్రి 9.30 గంటలకు స్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల అయింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో భారీ ఎత్తున విడుదల అయింది పుష్ప -2. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో అల్లు అర్జున్ అభిమానులతో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. పుష్ప సినిమాను 500 కోట్ల రూపాయలతో నిర్మించారు. మొదటి రోజునే 1000 కోట్ల కలెక్షన్స్ వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పుష్ప వైల్డ్ ఫైర్ చూపిస్తోంది.