Home Page SliderInternationalNationalSports

బాక్సింగ్‌డే టెస్ట్ లో పుష్ప ది రైజ్‌ సీన్‌

టీం ఇండియాలో తెలుగు కెర‌టం నితీష్ రెడ్డి …ప‌రుగుల అల‌ల‌తో కంగారూల‌కు వ‌ణుకు పుట్టిస్తున్నాడు.కెరీర్‌లో తొలి టెస్ట్ హాఫ్‌ సెంచురీని ఆసీస్ పై చేసి టీం ఇండియాను ఫాలో ఆన్ గండం నుంచి గ‌ట్టెక్కించాడు.ఈ సంద‌ర్భంగా రెడ్డి హాఫ్ సెంచురీ అనంత‌రం పుష్ఫ స్టైల్‌లో త‌గ్గేదేలే అంటూ సెల‌బ్రేట్ చేసుకున్నాడు.పుష్ఫ ఒక అడుగు ముందుకేసి ర‌ష్మిక మంద‌నా కాలుతో త‌గ్గేదేలే అంటూ వార్న్ చేస్తే…. తాను రెండ‌డుగులు ముందుకేసి బ్యాట్‌తో త‌గ్గేదేలే అంటూ వార్న్ సైన్ చేశాడు.దీంతో స్టేడియం మొత్తం పుష్ఫ మానియాతో మారుమోగింది.