Home Page SliderNational

సోషల్ మీడియాలోనూ “తగ్గేదేలే” అంటున్న పుష్ప హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా పుష్ప సినిమాతో ఆయన అంతర్జాతీయంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇటీవల కాలంలో  ట్విటర్‌కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ థ్రెడ్స్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ థ్రెడ్స్ యాప్‌లో అతి తక్కవ సమయంలోనే 1 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న మొట్టమొదటి భారతీయుడిగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డు సృష్టించారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీనిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. “పుష్ప ఎక్కడైనా తగ్గేదేలే,కలెక్షన్లతోనే సోషల్ మీడియాలోను చరిత్ర సృష్టించగలడు” అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. పుష్ప-1 కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.