పుష్ప ఎఫెక్ట్.. మద్యం అక్రమ రవాణా.. ముఠా అరెస్ట్..
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు చేశాడు. ఇద్దరి స్నేహితులతో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసుకువచ్చారు. తనిఖీల్లో గుంటూరు-1 ఎక్సైజ్ పోలీసులు గుర్తించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం కొరకు పోలీసులు విచారణ చేపట్టారు.

