‘పుష్ప- 2’ ప్రీరిలీజ్ ఈవెంట్..హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
మోస్ట్ ఎవయిటెడ్ మూవీ ‘పుష్ప- 2 ది రూల్’ విడుదలకు సిద్ధమయ్యింది. దేశవ్యాప్తంగా ప్రీరిలీజ్ ఈవెంట్లు నిర్వహించిన పుష్ప టీం ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ నిర్వహిస్తోంది. నేడు యూసఫ్‌గూడలోని పోలీస్ లైన్స్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనాలు హాజరవుతారని సమాచారం. దీనితో పోలీసులు నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
జూబ్లిహిల్స్ చెక్‌పోస్టు నుండి కోట్ల విజయభాస్కర్ స్టేడియం వైపు వాహనాలు శ్రీకృష్ణానగర్, శ్రీనగర్ కాలనీల మీదుగా పంజాగుట్ట చేరుకోవాలి. అలాగే మైత్రివనం జంక్షన్ నుండి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్ వాహనాలను కృష్ణానగర్ జంక్షన్ మీదుగా మళ్లిస్తున్నారు. బోరబండ నుండి మైత్రివనం జంక్షన్‌కు వెళ్లేవారు జీటీఎస్ కాలనీ, కళ్యాణ్ నగర్ జంక్షన్‌ల నుండి మైత్రివనం వైపుకు వెళ్లాలని పోలీసులు పేర్కొన్నారు. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కావస్తుండడంతో ఈ ఈవెంట్‌కు భారీగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.
Breaking news: కొట్టుకున్న అభిమానులు..100 మంది మృతి