Home Page SlidermoviesNationalNews Alert

‘పుష్ప-2’ ఓటీటీలోకి సిద్ధం

పుష్ప చిత్ర అభిమానులంతా ఎదురుచూస్తున్న ‘పుష్ప-2’ చిత్రం ఓటీటీ డేట్ ఖరారయ్యింది. జనవరి 30 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమంటూ డేట్‌ను రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌లో భారీ హిట్‌ను సాధించి, ఏకంగా రూ. 1896 కోట్లు వసూళ్లతో రికార్డు సృష్టించింది. కొత్తగా విడుదల చేసిన 20 నిమిషాల అదనపు సన్నివేశాలను కూడా జత చేసి, 3 గంటల 40 నిమిషాల నిడివితో ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.