ఓటీటీలో పుష్ప-2
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప-2 చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇటీవల రీ లోడెడ్ వెర్షన్ కూడా రిలీజ్ కావడంతో రూ. 2వేల కోట్లకు దగ్గరలో కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదలై 50 రోజులు దాటడంతో ఓటీటీలో విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.200 కోట్లకు సొంతం చేసుకుంది. అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాలలో ఇది రెండవస్థానానికి చేరుకుంది. రీలోడెడ్ వెర్షన్‌లో 20 నిమిషాల చిత్రం సమయం పెరగడంతో ఇప్పటికీ థియేటర్లకు ప్రజలు వెళుతున్నారు. ఈ చిత్రం మొత్తం నిడివి 3.40 నిమిషాలు ఉంది. ఈ మొత్తం సినిమానే ఓటీటీలో విడుదల చేస్తారు. దీనితో జనవరి చివరి వారంలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి. అంటే జనవరి 29 లేదా 31న ఈచిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.