చివరి ఘట్టాల్లో పుష్ప-2.. రిలీజ్ తేదీ: 6-12-2024
విడుదల ఆలస్యం అవుతున్నా.. ‘పుష్ప 2’ క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. టీజర్‌తోపాటు విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. దేవిశ్రీ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, బన్నీ స్టెప్స్, రష్మిక అందచందాలు.. వీటన్నింటికీ అందరూ ఫిదా అయిపోవాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో నిర్మించిన సెట్‌లో ఈ సినిమా పతాక సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు. డిసెంబర్ 6న విడుదల కానున్న ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రచించిన పదాలతో బ్యానర్లు సిద్ధమౌతున్నాయి. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మాతలు.