Home Page SliderTelangana

పుష్ప 2 డైరెక్టర్ ఇంట్లో ఐటీ సోదాలు..

హైదరాబాద్ లో రెండు రోజులుగా టాలీవుడ్ సెలబ్రీటీలు, వాళ్ల బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు జల్లెడ పడుతున్నారు. దిల్ రాజు, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా సంస్థల కార్యాలయాలపై ఐటీ సోదాలు చేస్తోంది. ఈ రోజు పుష్పా 2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఎయిర్ పోర్టు నుంచి సుకుమార్ ను నేరుగా ఇంటికి తీసుకెళ్లారు ఐటీ అధికారులు. పుష్ప 2 సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్, ఆదాయ వివరాలను ఆరా తీస్తున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఐటీ సోదాలు చేస్తున్న ఈ ప్రొడ్యూసర్స్ సినిమాలు తాజాగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సూపర్ హిట్ అయింది. అలాగే మైత్రీ మూవీస్ నిర్మించిన పుష్ప2 మన దేశంతో పాటు వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకు సుకుమార్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.