Home Page SliderTelangana

ఓ విద్యార్థి ప్రాణం తీసిన పూరీలు

స్కూల్ లంచ్ టైంలో భోజనం చేస్తుండగా పూరీలు గొంతులో ఇరుక్కొని ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన బేగంపేటలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిగూడకు చెందిన గౌతమ్ జైన్ కుమారుడు వీరేన్ జైన్ పరేడ్ గ్రౌండ్ సమీపంలోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం లంచ్ టైంలో భోజనం చేస్తూ తన లంచ్ బాక్స్ లో చుట్టలాగా చుట్టుకుని మూడు పూరీలను నోట్లో పెట్టుకుని తినేందుకు ప్రయత్నించాడు. దీంతో పూరీల చుట్ట గొంతులో ఇరుక్కొంది. వీరేన్ జైన్ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. అపస్మారక స్థితికి చేరడంతో స్కూల్ సిబ్బంది అతనిని వెంటనే సికింద్రాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

BREAKING NEWS : విషాహారం తిని విద్యార్ధిని మృతి