ఏపీ రాజధానిపై పురంధేశ్వరి సంచలన కామెంట్స్
ఏపీ రాజధాని విషయమై బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా బీజేపీ మద్దతు అమరావతికే ఉంటుందని ఆమె తేల్చి చెప్పారు. ఢిల్లీలోని పెద్దలు కూడా ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పానన్నారు. ఎందుకంటే అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పడు దాని అభివృద్ది చేయడానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. అంతేకాకుండా అమరావతిలో అభివృద్ది కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అమరావతిలో నేషనల్ హైవేలు,కారిడార్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. ఈ విధంగా చూస్తే అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.
