Andhra PradeshHome Page Slider

జగన్‌ పాలనపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు

ఈరోజు ఏపీలో బీజేపీ పార్టీ నేతల కార్యవర్గ సమావేశం జరిగింది. కాగా దీనిని ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో బీజేపీ నేత పురంధేశ్వరి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగుతోందన్నారు. అన్ని రంగాల్లో YCP ప్రభుత్వం విఫలమైందన్నారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు YCP అవినీతిపై BJP ఛార్జ్‌షీట్ రూపొందించినట్లు తెలిపారు. ఏపీలో ఏ వర్గం ప్రజలు కూడా జగన్ పాలనపై సంతృప్తిగా లేరు అనేది వాస్తవమన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వానికి తెలియజేస్తున్నామన్నారు. అంతేకాకుండా BJP ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనే విషయంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి వెల్లడించారు.