బీజేపీ ముఖ్య నేతలతో పురందీశ్వరి సమీక్ష
ఏపీ: విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై నాయకులతో చర్చిస్తున్నారు. ఏప్రిల్ 5 నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. బహిరంగ సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు. ఇటు ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల్లో పోటీచేసే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.