Home Page SliderTelangana

పురందేశ్వరి కేపీహెచ్‌బీ రోడ్‌షోలో ఉమ్మడి ప్రచారం…

చార్మినార్‌, కేపిహెచ్‌బీ కాలనీ: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం చార్మినార్ నియోజకవర్గంలోని పురానాపూల్ డివిజన్ పూల్‌బాగ్, ప్రగతినగర్ బస్తీల్లో ఆమె పార్టీ అభ్యర్థి మేఘారాణితో కలిసి పాదయాత్ర చేశారు. పాతబస్తీలో కనీస సదుపాయాలు మెరుగుపడడానికి బీజేపీని గెలిపించాలన్నారు. పార్టీ మైనార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి షబానామోమీన్ తదితరులు పాల్గొన్నారు. పురందేశ్వరి మంగళవారం సాయంత్రం కేపీహెచ్‌బీలో రోడ్‌షోతో ప్రచారం నిర్వహించారు. కూకట్‌పల్లి జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.