పవన్‌తో భేటీ కానున్న పురంధరేశ్వరి
త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అవుతానని ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ప్రకటించారు. విజయవాడలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ పొత్తులపై అధిష్టానమే నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. జోన్లవారీగా పర్యటించి,పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఏపీలో ఉన్నన్ని కోర్టు ధిక్కార కేసులు ఇంకెక్కడా లేవని వైసీపీపై మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవహారాల విషయంలో కేంద్రం ఎన్నోసార్లు హెచ్చరించిందన్నారు. నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం 7.14 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందన్నారు. అనధికార అప్పులు కూడా 4 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. రాబోయే కాలంలో మద్యం ద్వారా 8వేల కోట్ల అప్పులు చేశారన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల అంధకార ఆంధ్రప్రదేశ్‌గా ఉందన్నారు.

