Home Page SliderNational

రాహుల్ గాంధీకి పూణె కోర్టు సమన్లు

పూణెలోని స్పెషల్ కోర్టు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. 2023లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ, సావర్కార్‌పై  చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదయ్యింది. వినాయక దామోదర సావర్కార్ మనవడు చేసిన ఫిర్యాదుపై రాహుల్‌పై క్రిమినల్ పరువు నష్టం దావా ఫైలయ్యింది. పబ్లిక్ మీటింగులో నా ఇంటిపేరు గాంధీ, సావర్కర్ కాదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, తన పూర్వికులను అవమాన పరిచారంటూ సత్యకి సావర్కార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేయడానికి అక్టోబర్ 23న హాజరు కావాలంటూ  కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది.