బై ఎలక్షన్ లో హై టెన్షన్
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. టీడీపీ కేవలం అధికార బలంతో జడ్పీటీసీ కైవసం చేసుకోవడానికి రాష్ట్రంలోని టీడీపీ మంత్రులు నాయకులు పులివెందుల,ఒంటిమిట్ట లో పాగావేసి ఏది ఏమైనా, ఎలాగైనా జగన్ ఇలాఖాలో టీడీపీ జండా ఎగరవేయాలని అదికార పక్షం రిగ్గింగ్ కు పాల్పడిందని వైసీపీ వర్గాలు తెలిపారు.
- పులివెందులపై పగబట్టిన చంద్రబాబు,లోకేష్
- కొత్తపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి హలచల్
- మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనీయండయ్యా
- వైసీపీ ఏజెంట్లను, టీడీపీ నాయకుల నిర్బందం
- గ్రామ పొలిమేర్లలోని ఓటర్లను అడ్డుకున్న నేతలు
- దొంగ ఓట్లు వేసిన టీడీపీ నాయకులు
- అవినాష్ రెడ్డిని ని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఈసీ కి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు
ఒంటిమిట్టలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి హల్ చల్:
చిన్న కొత్తపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరియు అతని అనుచరుల వీరంగం సృష్టించి . మంత్రి సమక్షంలోనే వైసీపీ ఏజెంట్ పై టీడీపీ నేతలు చేయి చేసుకొని ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లపై బెదిరిరింపులకు పాల్పడుతూ రెచ్చిపోయి కర్రలతో కొట్టారంటూ ఓటర్లు వాపోయ్యారు . ప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ నేతలు దాడికి యత్నించి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి బూతు పురాణం అందుకున్నారు. పక్క జిల్లా నుంచి ఒంటిమిట్టకు వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. అసలు ఒంటిమిట్టకు సంబంధం లేకపోయినా కానీ మంత్రి హడావుడి చేశారు. మంత్రి వచ్చి పొలింగ్ బుత్లలో దౌర్జన్యం చేస్తున్నా కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఓటర్లను ప్రలోభపెట్టేలా ఒంటిమిట్ట పోలింగ్ బూత్ లోకి మంత్రి వెళ్లారు.
జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ దొంగ ఓటు:
టీడీపీ నేతలు ఓటర్లను బెదిరించి మరీ యధేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకుంటూ రిగ్గింగ్ కు పాల్పడ్డారని . ఈ క్రమంలో జమ్మలమడుగు నుంచి జనాలను తీసుకెళ్ళి నల్లపురెడ్డిపల్లి పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు వేయిస్తున్న వైనం బయటపడింది.వాళ్లలో పొన్నతోటకు చెందిన టీడీపీ రైతు కార్యదర్శి జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైఎస్ చైర్మన్ మల్లికార్జున్ కూడా దొంగ ఓటు వేయడానికి లైన్లో నుంచున్నారని .జమ్మలమడుగు అనంతగిరి, గూడంచెరువు పంచాయతీ గ్రామ పంచాయితీ గ్రామ టీడీపీ లీడర్ బాలఉగ్రం కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో దొంగ ఓటు వేశారని .ఆ జాబితాను పరిశీలిస్తే.. కర్మలవారిపల్లె సర్పంచ్ పుల్లారెడ్డి, గూడెంచెరువుకు చెందిన పాతకుంట శివారెడ్డి, చిన్న దండ్లూరుకు చెందిన రామచంద్రయ్య, కలవటలకు చెందిన రాజన్న, కంబళదిన్నెకి చెందిన కుళాయి, భీమగుండం వాసి రాజగోపాల్, నవాబుపేటకు చెందిన మర్రి ప్రకాశం,సన్నపురెడ్డి రామస్వామి రెడ్డి.. ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి ఉన్నారు. వీళ్లందరినీ గుర్తించిన వైసీపీ శ్రేణులు ఫొటోలతో సహా వివరాలను బయటపెట్టారు .
పోలీసుల కాళ్లు పట్టుకున్న పులివెందుల ఓటర్లు:
పులివెందులలో పోలీసుల సాయంతో టీడీపీ నాయకులు ఇష్టారాజ్యం గ రెచ్చిపోయారని బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లు వేయిస్తున్న టీడీపీ.. అసలు ఓటర్లను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు ఈ క్రమంలో ఖాకీలు ఈ చోద్యమంతా చూస్తూ ఉండిపోయారని . అయితే తాము ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ కొందరు ఓటర్లు అనూహ్య రీతిలో నిరసనకు దిగారు.పులివెందుల మండలం కనంపల్లిలో గ్రామస్తులను పోలీసులు అడ్డున్నారు. అయితే తమను ఓటు వేయనివ్వండంటూ వాళ్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు . “మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనీయండయ్యా” అంటూ అభ్యర్థించారు. అయినా పోలీసులు కనికరించలేదని ఈ క్రమంలో ఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారని.. దగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారంటూ స్థానికులు మండిపడ్డారు.మరోవైపు.. తమనూ ఓటేయకుండా అడ్డుకుంటున్నారంటూ పులివెందుల మండలంలోని పలువురు మహిళా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. “ఇళ్లలోకి దూరి పోలీసులే మమ్మల్ని బెదిరించారు. మీ ఇంట్లో మగవారు ఎటు వెళ్లారు? అంటూ గదమాయించారు. మా చేతుల్లోని ఓటర్ స్లిప్పులను లాక్కున్నారు. ఓటేయడానికి వెళ్తే ఇక అంతే సంగతులు అంటూ బెదిరించారు అంటూ కొందరు వాపోయారు. ఈ స్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదని.. వందల మంది స్థానికేతర రౌడీలు తమ ఓట్లను వేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
అచ్చివెల్లి, ఎర్రిపల్లిలో వైసీపీ ఏజెంట్లను టీడీపీ నాయకులు అడ్డుకొని అరాచకాలతో గ్రామాల్లో టెన్షన్ వాతావరణ నెలకోల్పారు . పోలింగ్ కేంద్రాల నుంచి నిస్సహాయంగా ఓటర్లు వెనక్కి తిరిగి వెళ్లారు . దౌర్జన్యంగా వెనక్కి పంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు . గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఓటర్లు అంటున్నారు.ఒక్క పోలింగ్ బూత్ లో కూడా పోలీసులు లేరని ఎక్కడికక్కడే పోలింగ్ బూత్లను ఆక్రమించుకున్నారని టీడీపీ మూకలు వైసీపీ ఏజెంట్లను రాకుండా అడ్డుపడ్డారు . గ్రామాల్లో పచ్చ మూకలు కర్రలు పట్టుకుని తిరుగుతూ ఎర్రిపల్లిలో పోలింగ్ బూత్ ను ఆధీనంలోకి తీసుకొని గ్రామంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించి ఓటు వేయకుండా అడ్డుకున్నారని మహిళలు వాపోయారు .టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారంటూ పులివెందుల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా కానీ పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. “నా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలు మోహరించారు. కర్రలు, రాడ్లతో ఓటర్లను భయపెడుతున్నారు. ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయడం లేదు” అంటూ హేమంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ మూకలు అరాచకం సృష్టిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ ను కూడా ఓటు వేయనివ్వలేదని ఇప్పటికే గ్రామంలోని రెండు పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకున్నారని అభ్యర్థి హేమంత్ ని బూత్ దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా కాపలా కాసారని ఎస్పీకి కాల్ చేసినా ఫలితం కనిపించలేదు. హేమంత్ గన్ మాన్ ను ఉన్నపళంగా అధికారులు మార్చేశారు. నిన్నటి వరకు ఉన్న న్ మాన్ ను తొలగించి మరొకరిని పంపించారు. బయటి నుండి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ వారికీ పోలీసులు వత్తాసు పలుకుతున్నారని అన్నారు .నల్లపురెడ్డిపల్లిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ కమిషన్ చెప్పే మాటలన్నీ నీట మూటలయ్యాయి. వైసీపీ ఏజెంట్లను, ఓటర్లను టీడీపీ నాయకులు నిర్బందించారని . ఏజెంట్ గా ఉన్న మాజీ ఎంపీపీ ని బలరాంరెడ్డిని బూత్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులే టీడీపీ అరాచక శక్తులకు అండగా ఉన్నారని మాజీ ఎంపీపీ బలరాం రెడ్డి మండిపడ్డారు. మాపై దాడులు చేసేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నిస్తున్నారు. జమ్మలమడుగు నుంచి టీడీపీ గుండాలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓటేసేందుకు వెళ్తే ఓటర్ స్లిప్పులను చించేశారంటూ ఓటర్ల ఆవేదన వ్యక్తం చేశారు.పులివెందులలో డీఎస్పీ మురళీనాయక్ వీరంగం సృష్టించారు. జడ్పీటీసీ ఎన్నికల్లో తమని ఓట్లు వేయనీయడం లేదని, జరుగుతున్న రిగ్గింగ్ ను ఆపాలంటూ ఓటర్లు పోలీసుకు విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న డీఎస్పీ ఓటర్లపై చిందులు తొక్కారు. వైసీపీ కార్యకర్తలపై బెదిరింపులకు దిగారు. ‘కాల్చిపడేస్తా నా కొడకా ఏమనుకుంటున్నావ్. యూనిఫాం ఇక్కడా.’. అంటూ హల్చల్ చేశారని .పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా మెట్ నూతనపల్లిగ్రామస్థులకు ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయింది.తమ ఊర్లో ఓటు వేసే పరిస్థితి లేదని, బయట వ్యక్తులు వందలాది మంది తిష్టవేసి తమ ఓట్లను వేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు . తమ ఓటర్ స్లిప్పులను తీసుకుని తరిమేశారంటూ మీడియాతో చెప్పుకున్నారు . అక్కడ తమను ఓటు వేయకుండా ఆడ్డుకోవడంతో చేసేది లేక వెనక్కి వచ్చామని మరికొన్ని చోట్ల వేలికి ఇంక్ పూసి ఓటు వేసేశారు వెళ్లిపోండి అంటున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
వైసీపీ ఆఫీస్ వద్ద పోలీసుల ఓవరాక్షన్
కూటమి ప్రభుత్వానికి పోలీసులు అండగా ఉన్నారనే విషయం మరోసారి నిరూపితమైంది. పులివెందుల వైసీపీ ఆఫీస్ గేట్లను మూసివేశారు. ఆఫీస్ లోకి వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో కార్యాలయానికి తాళం వేశారు. దాంతో ఆఫీస్ వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈసీ ఆఫీస్ ఎదుట వైసీపీ ఆందోళనకు దిగింది. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించాలని కోరుతూ నేతలు బైఠాయించారు. టీడీపీ అరాచకాల ఆధారాలను వైసీపీనేతలు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల కమిషన్ కళ్లు తెరిచి, పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ నేతలు నినాదాలు చేశారు.పులివెందుల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లతో టీడీపీ అడ్డదారి తొక్కుతోందని ప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ గూండాలను పెట్టిందని క్యూలో నిలబడి వారే ఓట్లేస్తున్నారు. క్యూ లైన్లలో అసలు ఓటర్ల బదులు దొంగ ఓటర్లు ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.పోలింగ్ స్టేషన్ వద్ద తిష్ట వేసి ఓటరు స్లిప్పులను ఇచ్చి జమ్మలమడుగు వాళ్లను టీడీపీ నేతలు పంపిస్తున్నారు. దొంగ ఓటు వేయాలన్నా స్లిప్పులో ఉన్న పేరుకు వయసుకు తేడా వస్తుందన్నా ఏం కాదంటూ టీడీపీ నేతలు పంపిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లి, నల్లగొండువారిపల్లి, ఎర్రబల్లి, కనంపల్లితో పాటు ప్రతి గ్రామంలో వందల కొద్దీ టీడీపీ గూండాలు మోహరించారు. గ్రామాల శివార్లలోనే వాహనాలను అడ్డుపెట్టిన టీడీపీ నేతలు ఎవర్నీ గ్రామంలో రానివ్వడం లేదని . కర్రలు, రాడ్లతో పహారా కాస్తున్నారు. పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు రాకుండా అడ్డగిచ్చారని మీడియాను కూడా గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతోంది. దొంగ ఓటర్లతో పోలింగ్ బూత్ల నిండిపోయాయి. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల నుండి విడుదలైన అవినాష్ రెడ్డి కడప కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం డీఐజీ కోయ ప్రవీణ్ పోలీస్ సిబ్బందితో మధ్యాహ్నం వైసీపీ కార్యాలయం వద్దకు వచ్చి అవినాష్ రెడ్డిని ఆఫీస్ లోనే నిర్భందించారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లు పులివెందులపై పగబట్టారని, మాజీ ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గం కావడంతో ఎలా అయినా గెలిచితీరాలనే పంతంతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల ద్వారా చేయాల్సిన నష్టం చేయిస్తున్నారని, అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో దౌర్జన్యానికి పాల్పడి, ప్రజల్ని ఓటు వేసుకోనివ్వకుండా చేశారని, పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేసుకుని రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ గెలిచినా తాను చేయాలనుకున్నది ఇక్కడ చేయలేదని హెచ్చరించారు. కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.