NationalNews

అల్లుడ్ని చూసి గర్వపడుతున్నానన్న మామ నారాయణ మూర్తి

రిషిని చూసి గర్విస్తున్నామని… ప్రధానిగా ఆయన విజయాన్ని కోరుకుంటున్నామన్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. తన అల్లుడు రిషి సునక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఎదగడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. సునక్, 42, కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహించే రేసులో గెలవడంతో ఆయన ప్రధానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి… బ్రిటన్ మొదటి ప్రధాన మంత్రి కాబోతున్నారు. రిషికి అభినందనలన్న మూర్తి… అతనిని చూసి ఉప్పొందిగిపోతున్నానన్నారు. ఇంగ్లాండ్ ప్రజల కోసం అతను తన వంతు కృషి చేస్తాడన్న నమ్మకం ఉందన్నారు. ఫార్మసిస్ట్ తల్లి, డాక్టర్ తండ్రి కుమారుడు ఐన… షి సునక్ ఇంగ్లాండ్‌లోని అత్యంత ప్రసిద్ధ పాఠశాలల్లో ఒకటైన వించెస్టర్‌లోనూ, ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నాడు. అతను గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ ఇంక్.లో మూడేళ్లు పడనిచేశాడు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ నుండి MBA పట్టా పొందాడు. అక్కడే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె, అక్షతా మూర్తిని కలుసుకున్నాడు. ఆమెను 2009లో రిషి వివాహం చేసుకున్నాడు. దంపతులకు కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.