మీ కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నా:కేటీఆర్ కుమారుడు
తెలంగాణా ఐటీ శాఖమంత్రి కేటీఆర్ తన కొడుకు హిమాన్షును ఉన్నత చదువుల కోసం ఇటీవల అమెరికా పంపించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తన కొడుకు ను మిస్ అవుతున్నానని తాజాగా ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్‌కు కేటీఆర్ కొడుకు హిమాన్షు ఇవాళ రిప్లై ఇచ్చారు. “నాన్నా ..నిన్ను రోజుకు ఒక్కసారి కలవడం నుంచి వర్చువల్‌గా మాట్లాడటం వరకూ..నాకు చాలా అసాధారణంగా అనిపిస్తుంటుంది. కానీ మీరు చెప్పినట్లుగా విజయం త్యాగాన్ని కోరుతుంది. మీ ప్రయాణమే అందుకు నిదర్శనం. మీ కొడుకుగా గర్వపడుతున్నా.నేను మరింత మెరుగవడానికి అదే స్పూర్తి” అని ట్వీట్ చేశారు.