హైదరాబాద్ వాసిగా గర్వపడుతున్నాను:KTR
మెర్సర్ కంపెనీ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్-2023 జాబితాను తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలున్న సిటీల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. కాగా దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. “హైదరాబాద్ వాసిగా గర్వపడుతున్నాను. గత 9 ఏళ్లల్లో హైదరాబాద్‌ను 6 సార్లు మెర్సర్ చార్టులో అగ్రస్థానంలో ఉండేలా చూసుకున్నాం.అయితే ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం దానిని మరోస్థాయికి తీసుకెళ్లాలి” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా ఇటీవల జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురవేసి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.