Andhra PradeshNews

మళ్లీ తెరపై ప్రొటోకాల్‌ వివాదం.. మంత్రి గుస్సా…

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్లను ఏపీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. మంత్రి హోదాలో రోజా దేవాలయా దర్శనానికి వచ్చిన క్రమంలో ప్రొటోకాల్‌ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. దర్శనానికి వచ్చిన రోజాకు దేవస్థానం ఛైర్మన్‌ చక్రపాణి రెడ్డి ఆహ్వానించలేదు.  దీంతో మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తనను అవమానించటానికే పాలకమండలి ఛైర్మన్‌ రాలేదంటూ మండిపడ్డారు. చక్రపాణి రాకపోవటంతో ఆలయ ఈవో.. ఇతర అధికారులు మంత్రి రోజాను మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి.. ప్రత్యేక పూజలు చేశారు. అయితే.. ఈ ఘటనతో మంత్రి రోజా, ఛైర్మన్‌ చక్రపాణి రెడ్డిల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇద్దరిదీ ఒకే నియోజకవర్గం కావటంతో రోజా చక్రపాణిల మధ్య విభేధాలు కొనసాగుతున్నాయని మరోసారి రుజువైంది.