కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ
హామీలు అమలు కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో చోటు చేసుకుంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజును హామీలపై ప్రజలు నిలదీశారు. ఆరు గ్యారంటీలంటూ మోసం చేశారని, హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు బుద్ది చెప్తామంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సమాధానం చెప్పలేక మధ్యలోనే వెళ్లిపోయారు ఎమ్మెల్యే నాగరాజు.