Andhra Pradeshhome page sliderHome Page Slider

మంత్రి లోకేశ్ కు నిరసన సెగ

ఏపీలోని ఒంగోలులో మంత్రి నారా లోకేశ్ కు నిరసన సెగ తగిలింది. ఇటీవలే హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబానికి లోకేశ్ పరామర్శించడానికి వెళ్లారు. అయితే.. లోకేష్ పరామర్శిస్తుండగానే గ్రామస్థులు ఆందోళనకు దిగారు. హత్య కేసులో అసలైన నిందితులను పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పూర్తిగా న్యాయం జరగలేదని మహిళలు మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. లోకేశ్ తో మాట్లాడుతామని భారీగా మహిళలు రాగా.. ఎవరితో మాట్లాడకుండానే లోకేశ్ కారెక్కి వెళ్లిపోయారు. బారికేడ్లను మహిళలు తోసుకుంటూ ముందుకొచ్చారు. ఎటువంటి భరోసానివ్వకుండానే లోకేశ్ వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.