Home Page SliderNews

బీసీసీఐ కాంట్రాక్టుల్లో జడేజాకు ప్రమోషన్… విహారికి నో ఛాన్స్

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) 2022-23 సీజన్ కోసం ‘సెంట్రల్ కాంట్రాక్ట్’ పొందిన ఆటగాళ్ల సుదీర్ఘ జాబితాను ప్రకటించింది. ఆల్-రౌండర్ రవీంద్ర జడేజాను అత్యధిక లబ్ధిదారులలో ఒకరిగా గుర్తించింది. A+ కాంట్రాక్ట్ ఇచ్చింది. KL రాహుల్ A నుండి Bకి దిగజారాడు.

భువనేశ్వర్ కుమార్, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహర్, హనుమ విహారిని పూర్తిగా కాంట్రాక్ట్‌ నుంచి తప్పించేసింది. సాహా, ఇషాంత్, రహానే లాంటి దిగ్గజాలకు ఏ స్కీమ్‌లోనూ చోటు లభించలేదు. భువనేశ్వర్ ఇటీవలి కాలంలో కొన్ని పరిమిత ఓవర్ల ఎన్‌కౌంటర్‌లు ఆడినప్పటికీ, అతన స్థానంలో కొందరు ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తోండటంతో బోర్డు పక్కనబెట్టేసింది.

దీపక్ చాహర్ ఇప్పటికీ అత్యుత్తమ ప్రతిభగా పరిగణించబడుతున్నప్పటికీ… గాయం సమస్యలు వెంటాడుతున్నాయి. భారత పేస్ అటాక్‌లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. టెస్టుల్లో భారత్‌కు ముఖ్యమైన స్క్వాడ్ ప్లేయర్‌గా ఉన్న హనుమ విహారి కూడా ఇప్పుడు కాంట్రాక్టు లిస్టులో లేకపోవడం విశేషం.

ప్రస్తుత జాబితా ప్రకారం, దీపక్ హుడా, కెఎస్ భరత్, అర్ష్‌దీప్ సింగ్ వంటి వారు గ్రేడ్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. అయితే అక్కడ శిఖర్ ధావన్ పేరును కాంట్రాక్టులో కొనసాగించారు. ధావన్ ప్రస్తుతం ఓపెనింగ్ బ్యాటర్ భారత జట్టు తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఆ స్థానాన్ని శుభ్‌మన్ గిల్‌ దక్కించుకున్నాడు. కానీ, గ్రేడ్ సి కేటగిరీలో కొనసాగడం BCCI వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.

BCCI సెంట్రల్ కాంట్రాక్ట్స్ లిస్ట్ 2022-23:

గ్రేడ్ A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

గ్రేడ్ A: హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్

గ్రేడ్ B: చేతేశ్వర్ పుజారా, KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభమాన్ గిల్

గ్రేడ్ సి: ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కెఎస్ భరత్