ప్రముఖ బెట్టింగ్ యాప్ యజమాని అరెస్ట్
ప్రముఖ బెట్టింగ్ యాప్ యజమానిని పోలీసులు ఇవాళ దుబాయ్‌లో అరెస్ట్ చేశారు.కాగా మహదేవ్ బెట్టింగ్ యాప్ సహ వ్యవస్థాపకుడు రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన యాప్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ చంద్రశేఖర్‌తో కలిసి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈడీ రవిపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. ఈ మేరకు ఈ రోజు పోలీసులు దుబాయ్‌లో రవిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రవి ఉప్పల్‌ను భారత్ తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.