హాలీవుడ్ కామిక్ కాన్‌లో ‘ప్రాజెక్ట్ K’ టైటిల్ రిలీజ్
పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు వరుసగా సూపర్ అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయి. నిన్ననే (గురువారం) సలార్ టీజర్ రిలీజ్ అవగా, ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ K ను హాలీవుడ్‌లోని సాన్‌డియోగో కామిక్ కాన్‌లో టైటిల్ ప్రకటించబోతున్నారు. దీనితో వారికి పండుగ వాతావరణం నెలకొంది. ఫిల్మ్ మేకర్స్, నిర్మాత అశ్విని దత్, దర్శకుడు నాగ్ అశ్విన్ కలిసి ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను కూడా చాలా గ్రాండ్‌గా ప్రకటించబోతున్నారు. టైటిల్, టీజర్, రిలీజ్ డేట్ మూడూ ప్రకటించబోతుడంతో ఈ ఫంక్షన్‌ను చాలా పెద్ద ఎత్తున అమెరికాలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశాపఠానీ వంటి నటులందరూ హాజరు కాబోతున్నారు.

ఇప్పటికే ‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డు కైవసం చేసుకున్న టాలెంటెడ్ యంగ్ డైరక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథతో కాస్త పౌరాణికాన్ని కూడా జత చేస్తుండడంతో ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి నెలకొంది. వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ చిత్రాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నారు నాగ్ అశ్విన్. ప్రభాస్, దీపికా పదుకొణె నటిస్తున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం నాగ్ అశ్వినే కావడం విశేషం. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మాటల రచయిత-సాయి మాధవ్ బుర్రా కాగా సంగీతం సంతోష్ నారాయణ కంపోజ్ చేశారు.

