Home Page SliderInternationalmovies

‘పుష్ప 2’ ధరల పెంపుకు నిర్మాతల ప్లాన్

రికార్డులపై రికార్డులు సృష్టిస్తున్న ‘పుష్ప-2 ది రూల్’ చిత్రానికి భారీ మార్కెట్‌ను కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. మొన్న పాట్నాలో విడుదలైన టీజర్  120 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.  నిర్మాతలు  టికెట్ ధరలు భారీగా పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో రూ.150 నుండి రూ.200 ఉన్న టికెట్ రేట్లను, రూ.300కి పెంచడానికి ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. అదేవిధంగా తెలంగాణలో కూడా పెంచుతారు. ఇక ప్రీసేల్ బుకింగ్స్‌లో పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా వన్ మిలియన్ల క్లబ్‌లో చేరింది. అమెరికాలో 3,230 షోలను ప్రదర్శించనున్నారు.