Home Page SliderNational

వరుణ్‌తేజ్-లావణ్యల పెళ్లిపై నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు

“బేబి” సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ నిన్న హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్ అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన వరుణ్-లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి గతంలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలను యాంకర్ ఆయనకి గుర్తు చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..”లావణ్య త్రిపాఠిని సరదాగా పెళ్లి చేసుకోమని చెబితే..మా వాడినే చేసుకుంటోందన్నారు”. అయితే లావణ్య మా ప్రొడక్షన్‌లో మూడు సినిమాల్లో నటించిందన్నారు. అందుకే ఆమె అంటే నాకెంతో ఇష్టం అని అలా చెప్పానని అల్లు అరవింద్ తెలిపారు.