ప్రియాంకదే వయనాడ్
కేరళలోని వయనాడ్ ఉప ఎన్నిక ఫలితాలలో ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి నవ్యా హరిదాస్‌పై 52 వేలకు పైగా ఆధిక్యతలో కొనసాగుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికలలో ఈ స్థానానికి ఎన్నికైన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమయ్యింది. రాహుల్ గాంధీ గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు స్థానాలలో గెలుపొందడంతో వయనాడ్‌లో రాజీనామా చేశారు. ఆ స్థానానికి తన సోదరి ప్రియాంకనే నిలబెట్టారు. దీనితో మళ్లీ వయనాడ్ ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. ఇటీవల కొండచరియలు విరిగిపడి వయనాడ్ అల్లకల్లోలమైన పరిస్థితిలలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరూ ఈ ప్రదేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే.