బ్రౌన్ స్విమ్ సెట్‌లో మతిపోగొడుతున్న ప్రియాంక
కొందరు వయసుతో సంబంధం లేకుండా సెలబ్రెటీస్ తాము చేసే కార్యక్రమాలన్నింటినీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ప్రచారం చేసుకుంటారు. కొందరు ఏం జరిగినా అసలు కన్పించరు. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ప్రియాంక చోప్రా ఆ తర్వాత బాలీవుడ్, హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హాలీవుడ్ నటుడు నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించారు. ఇక ఆమె ఏం చేసినా సంచలనమే. తాజాగా విదేశాల్లో ప్రియాంక చోప్రా భర్త నిక్ తో కలిసి తిరిగే విజువల్స్, ఇమేజెస్ పోస్ట్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తోంది. పెళ్లై ఇన్నాళ్లయినా, హాట్ హాట్ ఫోజులతో కిక్కెస్తోంది ప్రియాంక. ఇటీవల, దక్షిణ ఫ్రాన్స్‌కు విహారయాత్రకు బయలుదేరిన ఆమె అక్కడ ఎంజాయ్ చేసిన పరిసరాలను ఇన్ స్టాలో షేర్ చేసింది. బ్రౌన్ స్ట్రింగ్ బికినీ నియాన్ ఆరెంజ్ స్ట్రింగ్స్‌తో భర్త నిక్‌తో కలిసి కన్పించింది.

మరొక లుక్‌లో, నటి తన విహారయాత్రకు సరైన ఎంపికగా కనిపించే అద్భుతమైన తెల్లటి దుస్తులను ఎంచుకుంది. స్ట్రాప్‌లెస్ నంబర్ ఫిగర్-గ్రేజింగ్ ఫిట్‌తో దర్శనమిచ్చింది. అందమైన ఆభరణాలు, టోపీతో కన్పించింది. తర్వాత, ఆమె చిక్ వైట్ బికినీలో మరొక స్టైల్లో కన్పించింది. ప్రయాణ శైలి డైరీలకు మ్యాచింగ్ బాటమ్‌లతో స్ట్రాప్‌లెస్ బికినీ టాప్ ఎంచుకుంది. ప్రియాంక చోప్రా ఫ్యాషన్ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపెడతారు.


