వయనాడ్‌లో రాహుల్‌ని మించి ప్రియాంక దూకుడు..
కేరళలోని వయనాడ్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో దిగిన ప్రియాంక గెలుపును అందుకోబోతున్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ గత ఎన్నికలలో సాధించిన 3.64 లక్షల మెజారిటీని అధిగమించి 4 లక్షల మెజారిటీ దిశగా కొనసాగుతున్నారు. కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఆమె 5 లక్షల మెజారిటీ మార్క్‌ను దాటగలరని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికలలో తొలిసారి పాల్గొన్నా, రాజకీయ అనుభవం తక్కువేం కాదు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నో బహిరంగ సభలలో ప్రచారం చేసి, ఆమె ప్రజలను ఆకట్టుకున్నారు.