Home Page SliderNationalPolitics

“ప్రియాంక ఫెస్టివల్ సీజన్‌లా వచ్చిపోతోంది”..నవ్యా హరిదాస్

వయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ నామినేషన్‌ సమయంలో నిర్వహించిన రోడ్‌షోపై బీజేపీ పార్టీ సెటైర్లు వేస్తోంది. ప్రియాంక గాంధీ రావడం, రోడ్‌షోలు నిర్వహించడం సంవత్సరానికి ఒకసారి వచ్చిపోయే ఫెస్టివల్ సీజన్‌లాంటివని బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ వ్యాఖ్యానించారు. టూరిస్ట్ ప్రదేశానికి తీసుకెళతామని చెప్పి ప్రియాంక సభకు ప్రజలను తరలించారంటూ ఆరోపణలు చేశారు. ఒక అభ్యర్థి గొప్పతనం కుటుంబ ఆధిపత్యంపై ఆధారపడి ఉందంటే అది ప్రియాంకకే చెందుతుందని, కానీ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఏళ్ల తరబడి పని చేసిన అనుభవం తనకు ఉందని పేర్కొన్నారు నవ్య. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారికి అందుబాటులో ఎవరు ఉంటారో వారికి తెలుసని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలలో వయనాడ్ స్థానం నుండి గెలిచిన రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీలో కూడా గెలవడంతో వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీనితో ఇక్కడ నవంబర్ 13న ఉపఎన్నిక జరగనుంది.