6 గ్యారంటీల అమలు బాధ్యత నాదే అన్న ప్రియాంక గాంధీ
హైదరాబాద్: కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని ఆరు గ్యారంటీల అమలు బాధ్యత తనదేనని ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిరలలో ఎన్నికల ప్రచారం చేశారు. అమరుల కుటుంబీకులలో ఒకరికి తప్పనిసరిగా ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మట్టా రాగమయి, మల్లు భట్టివిక్రమార్కలకు మద్దతుగా శనివారం నిర్వహించిన రోడ్ షోలు, సభల్లో ప్రియాంకా గాంధీ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటకల్లో గ్యారంటీలను అమలుచేసి చూపించామని.. ఆధారాలతోనే చెబుతున్నానని అన్నారు. భారీగా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరిన ప్రియాంక గాంధీ.