Home Page SliderNational

మనీ లాండరింగ్ కేసులో ప్రియాంకగాంధీ పేరు

నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ పేరును చేర్చింది ఈడీ. అయితే ఆమెను నిందితురాలిగా పేర్కొనలేదు. చార్జిషీట్‌లో ఆమె పేరు, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరులను ప్రస్తావించింది. మనీ లాండరింగ్ అభియోగాలతో దళారి సంజయ్ భండారపై కేసు నమోదు అయ్యింది. భండారీ తన అక్రమ సంపాదనతో లండన్‌లో 12 బ్రియాన్‌స్టోన్ స్క్వేర్ అనే ఇంటిని దక్కించుకున్నారని, దానికి  రాబర్ట్ వాద్రా మరమ్మత్తులు చేయించారని, దానిలో వాద్రా నివాసం ఉన్నారని కూడా ఈడీ పేర్కొంది. బ్రిటన్‌లోని సుమిత్ చడ్డా అనే వ్యక్తి వీరికి సహకరించాడని చార్జిషీటులో పేర్కొంది. అలాగే హరియాణాలో కూడా భూమిని ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా దక్కించుకున్నారని, 2006లో కొన్న ఆ వ్యవసాయభూమిని, మళ్లీ 2010లో అదే ఏజెంట్‌కు విక్రయించారని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భండారీ 2016లోనే బ్రిటన్‌కు పారిపోయారు. భండారీని భారత్‌కు పిలిపించేందుకు ఈడీ, సీబీఐ బ్రిటన్ సర్కార్‌కు వినతి చేయగా, ఈఏడాది అంగీకరించారు.