Home Page SliderTelangana

హైదరాబాద్ చేరుకున్న ప్రియాంక గాంధీ

ఈ రోజు హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఈ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు.   కాగా బేగంపేట్  ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రియాంక గాంధీకి టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి సహ పలువురు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. ప్రియాంక మరికాసేపట్లో హెలికాప్టర్‌లో  ఎల్బీనగర్‌కు వెళ్లనున్నారు. అనంతరం సరూర్‌నగర్‌ బహింరంగ సభలో ఆమె పాల్గొననున్నారు. తెలంగాణాలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సరూర్‌నగర్‌లో జరగబోయే ప్రియాంక గాంధీ బహిరంగ సభ ప్రాధాన్యం సంతరించుకొంది.  ఈ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే తెలంగాణా రాష్ట్రంలో ప్రియాంక గాంధీ పాల్గొననున్న మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇదే కావడం గమానార్హం.