తెలంగాణకు నేడు వస్తున్న ప్రియాంక గాంధీ
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ తొలిసారి పర్యటించనున్నారు. కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కొత్తగూడెం రైల్వేస్టేషన్ సమీపంలో కూడలి సమావేశానికి హాజరవుతారు. హెలికాప్టర్‌లో హుస్నాబాద్ నుండి ఇక్కడికి రానున్నారు. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కొత్తగూడెం నుండి బరిలో నిలిచిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా ప్రియాంకగాంధీ ప్రచారం చేస్తారు. మ.1.30 గంటలకు సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడి నుండి మధిరకు చేరుకుని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజయానికి సపోర్ట్‌గా రోడ్ షోలో మాట్లాడతారు. అనంతరం మధిర నుండి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెడతారు.