Home Page SliderInternational

ప్రియాంకకు RRR సినిమా చూడడానికి టైం లేదట

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా RRR సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ఈ సినిమా చూడడానికి టైం లేదంటూ, హాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నానంటూ వ్యాఖ్యానించింది. ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకుని హాలీవుడ్‌కి వెళ్లిన ప్రియాంక ఎక్కువగా సినిమాలు చూడదట. టైం దొరికితే టీవీ షోలు చూస్తానని చెప్పింది. ఆస్కార్ అవార్డ్ సాధించిన ఈ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని, రామ్ చరణ్‌ను బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియాగా అంగీకరిస్తానని పేర్కొంది. వీరిద్దరిలో ఎవరు అందంగా ఉంటారంటే మాత్రం బ్రాడ్ పిట్ తన క్రష్ అని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని తెలిపింది. అయితే ప్రియాంక మాటలపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో కూడా ఆమె RRR చిత్రాన్ని తమిళ చిత్రం అని పేర్కొంది. కేవలం మూడు గంటల సమయం కూడా దొరకలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.