వార్తలు చదువుతున్న AI యాంకర్‌ని చూశారా?
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ రాకతో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒడిశాలో ఈ టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమ యాంకర్‌ని సృష్టించారు. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌తో రూపొందించబడిన ఈ కృత్రిమ యాంకర్‌తో OTV న్యూస్ ఛానెల్ వార్తలు చదివిస్తోంది. అయితే ఈ AI యాంకర్‌కు లిసా అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ AI యాంకర్ లిసా బహుళ భాషలు మాట్లడగలదు. అయితే ప్రస్తుతానికి ఒడియా,ఇంగ్లీష్ భాషల్లో వార్తలను చదువుతోంది అని ఆ సంస్థ MD తెలిపారు. కాగా ఈ AI యాంకర్ భవిష్యత్తులో వీక్షకుల ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తారని వెల్లడించారు.