ఫీజు కోసం ‘చీపురుకట్టతో’ పేరెంట్స్‌పై ప్రిన్స్‌పాల్ దాష్టీకం
ప్రైవేట్ స్కూల్స్ అఘాయిత్యానికి అద్దం పట్టింది వీఎన్‌జీ స్కూల్ సంఘటన. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు వద్ద వీఎన్‌జీ స్కూల్‌లో ఒక విచిత్ర సంఘటన జరిగింది. స్కూల్ ఫీజు 11 వేల రూపాయలు చెల్లించాల్సి ఉందని, విద్యార్థుల తల్లిదండ్రులపై చీపురుకట్టతో తిరగబడ్డాడు స్కూలు ప్రిన్సిపాల్ మర్రే శివ. పరీక్షలు జరిగిపోతున్నాయని, ఫీజులు ఇంకెప్పుడు కడతారంటూ విరుచుకుపడుతున్నారు. దీనితో కొందరు అడ్డుకోవడంతో కాస్త చల్లబడ్డాడు. మిగిలిన టీచర్లు కూడా ఆయనకు సపోర్టు చేస్తున్నారు. ఇదంతా వీడియో తీసి, ప్రశ్నించడంతో తానేమీ చేయలేదని బుకాయిస్తున్నాడు ఈ పంతులు గారు. ఇది వైరల్ కావడంతో సర్కారు స్కూలులో సౌకర్యాలుండవు, ప్రైవేటు స్కూలులో ఫీజుల మోత అంటూ వాపోతున్నారు మధ్యతరగతి ప్రజలు.