Home Page SliderTelangana

కీచక ప్రిన్సిపల్.. విద్యార్థినిపై అత్యాచారయత్నం

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ప్రిన్సిపాల్ విద్యార్థిని అత్యాచారయత్నం చేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని లయోలా పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలోనూ ప్రిన్సిపల్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థినిలను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ కీచక ప్రిన్సిపల్ పై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.