Home Page SliderInternational

మంకీపాక్స్‌పై ప్రధాని కార్యాలయం కీలక అప్‌డేట్

భారత్‌లో మంకీపాక్స్‌ వ్యాప్తిపై ప్రధాని కార్యాలయం కీలక అప్‌డేట్ ప్రకటించింది. ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నిర్విరామంగా పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. భారత్‌లో ఇంతవరకూ ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆఫ్రికాలోని పలు ప్రాంతాలలో మంకీపాక్స్ కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం 2022 నుండి 116 దేశాలలో మంకీపాక్స్ వ్యాప్తిలో ఉంది. ఈ వ్యాధి కారణంగా 208 మరణాలు సంభవించాయి. కాంగోలో ఈ కేసులు బాగా ప్రభలినట్లు తెలుస్తోంది. భారత్‌లో చివరి కేసు మార్చిలో నమోదయ్యిందని, అటు పిమ్మట మరో కేసు ఇంతవరకూ నమోదు కాలేదని పీఎంవో పేర్కొంది. ప్రస్తుత అంచనాల ప్రకారం మంకీపాక్స్ అవుట్ బ్రేక్ అధికంగా ఉన్నా కూడా, వ్యాప్తి చెందే అవకాశం తక్కువగానే ఉందని పేర్కొన్నారు.